Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన

Hatah Teaser Release Date 300kb

Hatah Teaser Release Date 300kb

బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్‌లాపింగ్ రిలీజ్‌ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్‌ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, ముఖ్యంగా బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని మేకర్స్ స్పష్టం చేశారు. హడావిడిగా ఇతర సినిమాలతో పోటీ పడుతూ సినిమాను థియేటర్లలోకి వదిలేయడం కంటే, ప్రతి ప్రేక్షకుడికి ఆ సినిమాలోని ఫీల్‌ను 100 శాతం క్వాలిటీతో డెలివరీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, ఇప్పటివరకు ప్రేక్షకులు తమపై చూపించిన ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ‘హతహ్’ టీమ్ ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో “కొత్త తేదీ.. మరింత మెరుగైన అనుభూతి” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మేకర్స్ మరింత పెంచేశారు. ఒక అడుగు వెనక్కి వేసినా, పక్కా క్వాలిటీతో విజువల్ మరియు ఆడియో పరంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలనే కసితో ‘#HATAH’ టీమ్ రాబోతోందని చెబుతోంది. త్వరలోనే రాబోయే ఆ సరికొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.