Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Love Story Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను మేరక్స్ తాజాగా అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఓ అందమైన ప్రయాణంగా ఎలా మారతాయో ట్రైలర్లో మేకర్స్ చూపించారు. స్టీవెన్, నివి అనే ఇద్దరు యువతీయువకుల ప్రేమకథ చుట్టూ ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ప్రేమలోని ఆనందం, బాధ, కలలు, జీవితాన్ని మార్చే కీలక క్షణాలను డైరెక్టర్ హృద్యంగా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు నుంచి నేను మీరు నా దేవత.. నేను మీ బానిస.. అంటూ పలికిన డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం నిజాయితీతో కూడిన, భావోద్వేగభరితమైన యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, తాజా ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!