Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, కోలీవుడ్ నటి గౌరీ ప్రియ కాంబినేషన్లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్‌ను విజయవాడలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్, రఘురామకృష్ణం రాజు, హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయవాడలో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మూడు గంటల పాటు వేచి చూసిన అభిమానులను చూసి హీరో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “విజయవాడ స్టేజ్ నాకు ఎప్పుడూ బాగా కలిసి వస్తుంది. గతంలో ‘SR కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల ఈవెంట్లు ఇక్కడే జరిగి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ అంతకుమించి నాలుగు రెట్లు పెద్ద హిట్ కాబోతోంది. గతంలో వచ్చిన ‘బేబీ’ సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్ అయితే, మా ‘చెన్నై లవ్ స్టోరీ’ అంతకంటే స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ సినిమా మీ గుండెల్లో గుర్తుండిపోతుందని విజయవాడ సాక్షిగా ప్రామిస్ చేస్తున్నా” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
“నా మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’లో చాలా ఇన్నోసెంట్, సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఈ సినిమాలో ‘స్టీవెన్’ అనే అలాంటి క్యూట్ క్యారెక్టర్‌తో మీ ముందుకు వస్తున్నా. మాస్ అంతా అయిపోయింది.. ఈసారి పక్కా క్లాస్ లవ్ స్టోరీతో వస్తున్నాం. జూలై 24న వెండితెరపై మునుపెన్నడూ చూడని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను మీరు చూస్తారు. అంతకంటే ఒకరోజు ముందుగానే.. అంటే జూలై 23న ఇరు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. జూలై 12 లేదా 13న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది” అని కిరణ్ అబ్బవరం ప్రకటించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, ఎస్కేఎన్, రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?