శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ‘కేజీఎఫ్’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ‘గరుడ’ రామ్ ఈ చిత్రంలోనూ పవర్ ఫుల్ రోల్ లో కనిపించన్నట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన శర్వా, సిద్ధార్థ్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ‘మహా సముద్రం’ పై ఉత్కంఠను పెంచుతుంది.