మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.వైవిధ్యమైన పాత్రలు, కథాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నమ్మిన దాని కోసం నిలబడే స్వతంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కలిసి చూసే ఎమోషనల్ మూవీగా అలరిస్తోంది. అందుకనే విడుదలైన 24 గంటల్లోనే ఈ చిత్రానికి 50 మిలియన్ స్ట్రీమింగ్ రావటం విశేషం.
Also Read : Re Release : వచ్చే వారం రీరిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే..
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.