తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నాడన్న విషయం తెలిసిందే. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ విన్పించగా… లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. అదే నిజమైతే విజయ్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మహేష్ బాబు, రామ్ చరణ్ లు రిజెక్ట్ చేసినప్పటికీ దర్శకుడు వంశీ పైడిపల్లి చివరకు విజయ్ తో కలిసి పాన్-ఇండియన్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. మహేష్ బాబుతో అతను చేయాలనుకున్నదానికంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలావుండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తి సురేష్ ఇంతకు ముందు విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం అవుతుంది. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది.