Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్‌లో షూటింగ్ సెట్స్‌లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్‌గా చెప్పేసింది.
గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో తనపై తనకే అనుమానం వచ్చిందని కీర్తి చెప్పుకొచ్చింది. “వాళ్లు ప్రవర్తించే తీరు చూసి షూటింగ్ సెట్స్‌లో చాలా నెర్వస్ అయిపోయేదాన్ని. నా యాక్టింగ్‌లోనే ఏదో లోపం ఉందేమో, నేనే తప్పు చేస్తున్నానేమో అనుకుని తెగ భయపడేదాన్ని” అని గుర్తుచేసుకుంది. అయితే కొన్నాళ్లకు అసలు విషయం అర్థమైందని చెప్పింది. “తప్పు నా దగ్గర లేదు.. అసలు సమస్య వాళ్లదే అని తర్వాతే తెలిసింది. వాళ్లకున్న భయం, ఇన్ సెక్యూరిటీని నా మీద చూపించేవారు. నన్ను తక్కువ చేసి మాట్లాడి నా కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని చూశారు” అంటూ కుండబద్దలు కొట్టేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఎవరూ బయటకు చెప్పరు. కానీ కీర్తి సురేష్ ఇంత డైరెక్ట్‌గా తోటి నటుల తీరును ఎండగట్టడంతో.. ఇంతకీ ఆమెను అంతలా టార్గెట్ చేసిన ఆ నటులు ఎవరబ్బా అంటూ సినీ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు.
Also Read
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
- Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
- Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
- Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
తాజావార్తలు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!