Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి తిరుగులేని సూపర్ స్టార్లు.. శంకర్, అట్లీ, లోకేశ్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కోలీవుడ్ ఎక్కడ వెనకబడిపోతోంది. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘లియో’ రిలీజ్ సమయంలో తమిళంలో మొదటి వెయ్యి కోట్ల సినిమా ఇదే అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆ మార్కును అందుకోలేకపోయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాపై కూడా ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు.. అయితే అది కూడా రూ.1000 కోట్ల బెంచ్‌మార్క్‌ను టచ్ చేయలేకపోయింది. కోలీవుడ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల దగ్గరే బ్రేకులు పడిపోతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
‘జైలర్ 2’ తోనైనా సాధ్యమేనా
ప్రస్తుతం అందరి కళ్లూ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ పైనే ఉన్నాయి. అయితే ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా కూడా ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా సరే, వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇతర భాషల్లో పాన్ ఇండియా మార్కెట్‌ను పూర్తిగా ఒడిసిపట్టడంలో తమిళ సినిమాలు ఇంకాస్త వెనకబడటమే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోలీవుడ్‌కు కనిపిస్తున్న ఒకే ఒక్క బలమైన ఆశాకిరణం రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి చేయబోయే భారీ మల్టీస్టారర్ సినిమానే. భారతీయ చిత్రసీమలోని ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ హైప్ వేరే లెవల్లో ఉంటుంది. సరైన పాన్ ఇండియా కథ కుదిరితే, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు సాధించిన ఆ రూ.1000 కోట్ల రికార్డును తమిళ సినిమా కూడా అందుకోవడం ఖాయమని సినీ పండితులు లెక్కలేస్తున్నారు. మరి కోలీవుడ్‌కు పట్టిన ఈ వెయ్యి కోట్ల లోటును ఈ ఇద్దరు లెజెండ్స్ తీరుస్తారా? లేక ఆ కల అలాగే మిగిలిపోతుందా అన్నది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!