‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకున్న కీర్తి సడెన్‌గా, తన పాత్రల ఎంపిక విషయంలో రూట్ మార్చింది. తన ‘వెర్షన్ 2.0’ ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుకు నిదర్శనం విజయ్ దేవరకొండతో ఆమె నటించబోయే సినిమా ‘రౌడీ జనార్దన్’ అని చెప్పాలి.
Also Read : Prashanth Varma : ప్రశాంత్ వర్మ ను ఏకిపారేస్తున్న మూవీ లవర్స్
రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో కీర్తి సురేష్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతుంది. అంతే కాదు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కీర్తి సురేష్ ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్ బాబుతో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ లిప్ లాక్ మాత్రం లేదు. మరి, ‘రౌడీ జనార్దన్’ లో మాత్రం ఇది నిజం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రజంట్ కీర్తి ఐడియాలజీ మొత్తం చేంజ్ అయ్యింది.. తన కెరీర్‌లో ప్రయోగాలు చేయడానికి వెనుకాడటం లేదు. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. పాత పద్ధతిలో వెళితే పని అవ్వదని గ్రహించిన ఈ అమ్మడు రూట్ మార్చినట్లు తెలుస్తుంది.