Keerthy Suresh : ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై.. కీర్తి సురేష్ సీరియస్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై ఇటీవల పెద్ద చర్చ నడుస్తున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ వంటి భారీ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఈ పని గంటల కారణంగానే ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో “రోజుకు 8 గంటల షూటింగ్” అనే షరతు ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంపై తాజాగా కీర్తి సురేష్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read : Manchu Lakshmi: కుటుంబ కలహాలపై.. మొదటిసారి స్పందించిన మంచు లక్ష్మి
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
కీర్తి మాట్లాడుతూ.. ‘ఏ రకం షెడ్యూల్‌కైనా తాను అలవాటు పడగలనని, మహానటి సినిమా సమయంలో ఒకే రోజులో మూడు వేర్వేరు సినిమాల సెట్లకు వెళ్లి షూట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఉదయం ఒక సినిమా, మధ్యాహ్నం ఇంకో సినిమా, సాయంత్రం మరొక సినిమా ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేశా అని తెలిపింది. కానీ ఇది ప్రతి నటుడికి సాధ్యం కాదని, వారి పరిస్థితులు, సామర్థ్యాలు వేరుగా ఉంటాయని కూడా ఆమె స్పష్టం చేసింది. 9 నుండి 6 వరకు జరిగే రెగ్యులర్ షిఫ్ట్ గురించి మాట్లాడుతూ.. ‘9 గంటలకు షూట్ ఉంటే 7:30 కి సెట్ ల్లో ఉండాలి అంటే.. మనం 5:30 కల్లా నిద్ర లేవాల్సి వస్తుంది, సాయంత్రం 6.30కి షూట్ ముగిసినా మేకప్ తొలగించుకోవడం, కాస్ట్యూమ్స్ మార్చుకోవడం, ఇంటికి చేరుకునే సరికి రాత్రి 10.30 అవుతుంది. తర్వాత జిమ్ కి వెళ్ళాలి. దీని బట్టి నటులు రోజుకు 6 గంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు’ ఇది మంచిది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా టెక్నీషియన్ల కష్టాల గురించి కూడా మాట్లాడుతూ.. ‘నటులు ఆలస్యంగా వచ్చి ముందే వెళ్లిపోతారు కానీ లైట్, కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వంటి టెక్నీషియన్స్ మాత్రం, మాకంటే ముందే వచ్చి చివర్లోనే సెట్ నుండి బయలుదేరుతారు. వారి పని గంటలు మరింత కఠినంగా ఉంటాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లలో 9–6 షిఫ్ట్ విధానం పెరుగుతున్నప్పటికీ మాలీవుడ్, బాలీవుడ్‌ల్లో ఇంకా 12 గంటల షిఫ్ట్లే పాటిస్తున్నారు. మాలీవుడ్‌లో చెప్పాలంటే.. బ్రేక్ లేకుండా పని చేసే పరిస్థితుల్లో లైట్మ్యాన్లకు రోజుకు కేవలం 3–4 గంటల నిద్రే దొరుకుతుంది’ కూడా ఆమె పేర్కొన్నారు. మొత్తానికి, ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై జరుగుతున్న చర్చలో కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు నటీనటులే కాకుండా టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న అసలు పరిస్థితులను బయటపెట్టినట్లయ్యింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!