ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాష్ సినిమాల్లో నటిస్తున్న ఆమె శింబు తో పాటు ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ కేవలం రెండు నెలల్లోనే గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్య బీట్ చేసింది. అలాంటిది ఈ అమ్మడుకి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
Also Read: Pawan Kalyan : ‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..
ఏంటీ అంటే బజ్ ప్రకారం, టాస్మాక్ స్కామ్ వ్యక్తులతో ఆమె కు సంబంధాలు ఉన్నయని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డింది అని వారిపై ED దాడి సమయంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరు కావడానికి కయాదు లోహర్‌కు దాదాపు 35 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇది ఇప్పుడు వైరల్‌గా మారి కోలీవుడ్ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఇది షాకింగ్‌గా అనిపిస్తోందని, తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతికి పాల్పడటం ప్రారంభిస్తోందని.. కామెంట్‌లు చేస్తున్నారు.