Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో సినిమాల కంటెంట్ చివరి నిముషం వరకు డైరక్టర్లు ఇవ్వకపోవడంపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. లెనిన్ షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున ఎప్పుడూ మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకునే అలవాటు లేదు. కానీ, ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ టీం, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం ఇస్ అవుట్‌స్టాండింగ్; అవుట్‌స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సివి సర్, “ఈ సినిమా నాకు అట్లీస్ట్ ఒక టూ త్రీ వీక్స్ బిఫోర్ ఇవ్వండి, ఎవ్వరూ ఇవ్వట్లేదు, మా క్వాలిటీ చూపిస్తాం ఏం చేస్తాం” అని అడిగారు. ఇవ్వలేకపోయాం. ఇది కూడా నేను ఇస్తాను అని ప్రామిస్ చేశాను, బట్ ఐ కుడ్ నాట్ గివ్; టూ వీక్స్ బిఫోర్ ఇవ్వలేకపోయాను. జస్ట్ టు డేస్ బిఫోర్ ఇచ్చాను ఫుల్ ఫిలిం అతనికి. అండ్ ఎటువంటి క్వాలిటీ ఇచ్చారు అంటే, ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు టూ వీక్స్. నిజంగా టూ వీక్స్ ముందు ఇచ్చుంటే ఇంకా ఈ సినిమా, లెనిన్ సినిమా క్వాలిటీ ఎక్కడో ఉండేది, ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్.
రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ… మీరు ఒక రెండు వారాల ముందు ఇస్తే ఈ సినిమాని, ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఒక రెండు వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీం కి ఇచ్చేస్తే, ఒక ఆ ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు దాన్ని చెక్కి చెక్కి చెక్కి, దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవరీబడీ టు డు; ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను, నేను కూడా కరెక్షన్స్ అని కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి, అది నొక్కి లాస్ట్ మినిట్ లో చేశాను; డైరెక్టర్ కూడా చేశాడు. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, అలాగే ఎడిటర్, నేను చేసుకున్నాం. సో, ఒక్కళ్ళని కాదు అందరూ కలిసి ఆలోచించి టూ వీక్స్ బిఫోర్, టూ వీక్స్ బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికన్నా తీసుకెళ్లొచ్చు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇప్పుడు ఒక ‘ఒడిస్సీ’ అనే సినిమా రిలీజ్ అయింది; ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు, వన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను, నేను ఈ సినిమా, లెనిన్ సినిమాకి చేశాను. ఆ జూన్ 2026 అన్నాను, జూన్ 2026 కి అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వి డిడ్ నాట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్ గా ఫినిష్ చేయలేకపోయాం. సో, టూ వీక్స్ పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది, బెటర్ బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశి(నాగ వంశీ), నీకు కూడా చెప్తున్నా ఇట్స్ జస్ట్ ఏ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ‘నిన్నే పెళ్లాడతా’ గానీ, ‘అన్నమయ్య’ సినిమా గానీ… నా సొంత సినిమాలు, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను, ఆల్మోస్ట్ వన్ మంత్ బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము; వన్ మంత్ బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ మైసెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, “వై కాంట్ ఐ డు ఇట్?” అని. సో, ఐ యామ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అని అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు