Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య హీరోగా RJ బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కరుప్పు. డ్రీమ్ వారియర్ పిచర్స్ బ్యానర్ పై S R ప్రభు & S R ప్రకాష్ బాబు నిర్మించిన కరుప్పు ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ సినిమా షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోస్ కు బుక్ చేసిన టికెట్స్ ని రద్దు చేసి రిఫండ్ చేసారు. అభిమానులను మరియు ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా ఈరోజు మంచి స్పీడ్ చూపించింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయి భారీ ఓపెనింగ్ ఉంటుందనుకున్న టైమ్ లో వాయిదా పడింది.
ఈ సినిమా రిలీజ్ కు ఆర్థిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయని సమాచారం ప్రకారం. సినిమా విడుదలకు క్లియరెన్స్ రావాలంటే దాదాపు 50 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందట. ఈ భారీ మొత్తాన్ని సర్దుబాటు చేసేందుకు మేకర్స్ కిందా మీదా అవుతున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను ముఖ్యంగా USA లోని ప్రముఖ థియేటర్ చైన్స్ ఈరోజు జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేయడమే కాకుండా, వీకెండ్ మొత్తం షోలను ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాయి. ఒకవేళ ఈ రోజు చివరి నిమిషంలో క్లియరెన్స్ వచ్చినా అనుకున్న స్థాయిలో షోలు పడటం కష్టమేనని ట్రేడ్ భావిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఫ్యాన్స్ కు అంతా అయోమయంగా ఉంది. రేపటివరకైనా ఈ సమస్యలు పరిష్కారమై సినిమా సజావుగా విడుదలవుతుందా లేదా అనే టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు షోలు రద్దు కావడంతో నిరాశ చెందుతున్నారు.
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!