యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ డైనమిక్ గా, మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.
Also Read : హీరోయిన్ తో సహజీవనం, మోసం… మంత్రి అరెస్ట్
వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.