‘ఆర్.ఎక్స్.100’ సాధించిన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ ఆ చిత్రం కంటే ముందు నటించిన మూవీ ‘ఫైనల్ సెటిల్మెంట్’. వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాధాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటాయి. సమాజానికి పట్టిన చీడపురుగులు ఒకళ్ళనొకళ్లు చంపుకోవడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు కూడా మిన్నుకుంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే ‘ఫైనల్ సెటిల్మెంట్’. కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘ఛత్రపతి’ శేఖర్, సతీష్ లంకా, మనస్విని, సలీం, భాస్కర్ రాజు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జమ్మలమడుగు మోహన్ కాంత్ స్వీయనిర్మాణంలో ‘ఫైనల్ సెటిల్మెంట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. పోసాని, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆపరేషన్ ఐపీఎస్’ను రూపొందించిన మోహన్ కాంత్ కు ‘ఫైనల్ సెటిల్మెంట్’ దర్శకుడిగా రెండో సినిమా.