Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?

Cameo Ajith Kumar

Cameo Ajith Kumar

అజిత్ హీరోగా ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ అనే దర్శకుడితో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా అజిత్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత డేర్ డెవిల్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కూడా ఈ నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తర్వాత చెన్నైలో కూడా ఈ సినిమా షూట్ చేసే అవకాశం ఉంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒక క్యామియోలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఆయన సీఎం పాత్రలోనే కనిపిస్తారా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తారా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉన్ని ముకుందన్, పార్థివన్, ప్రభు, సునీల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి శాలిని అజిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే సీఎం అతిథి పాత్ర అనే వార్త ప్రస్తుతానికైతే గాసిప్ కాగా అది నిజమవుతుందా లేక కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు లేదా సీఎం తో షూట్ చేసే వరకు ఆగక తప్పని పరిస్థితి.