బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తిరగబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ గ్లామర్, సీరియస్, ఫ్యామిలీ డ్రామా రోల్స్‌తో ఆకట్టుకున్న కరీనా, ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన పాత్రలోకి మారబోతున్నారు. ఓ హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ కోసం ఆమె ఓ యువ నటుడితో స్క్రీన్ షేర్ చేయనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కరీనా ఒక దెయ్యం పాత్రలో కనిపించనుందట. ఇప్పటిదాకా ఆమె చేసిన పాత్రల్లోనే ఇది అత్యంత ప్రత్యేకం అని అంటున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్రాలకు పనిచేసిన రచయిత హుస్సేన్ దలాల్ ఈ చిత్రానికి కథ అందించనున్నారని సమాచారం. ఇది కేవలం హర్రర్ కథ కాదు, ఎమోషనల్, ప్రేమ, మానవ సంబంధాల తో కూడిన కొత్త కోణంలో తెరకెక్కనుంది.
Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. కానీ – మృణాళ్ ఎమోషనల్
ఇక కరీనా సరసన నటించనున్న యువ నటుడు ఎవరు అనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడవలేదు కానీ, బాలీవుడ్‌లో పలు యువ తారల పేర్లు తెరపై వినిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కంటెంట్‌ను బేస్ చేసుకుని నటిస్తున్న నటి కరీనా, ఈ ప్రయోగంతో మరింత ఫ్యాన్ బేస్‌ను సంపాదించనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే, ఈ కొత్త కథ, యువ నటుడితో రొమాన్స్, హర్రర్ థీమ్ అన్నీ కలిపి, బాలీవుడ్‌కు ఒక రిఫ్రెషింగ్ ప్రాజెక్ట్ దిశగా కనిపిస్తున్నాయి.