గత కొంత కాలంగా, బాలీవుడ్ లో ఎవరైనా, దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారంటే…. అది కరణ్ జోహరే! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. నెపోటిజమ్ పేరుతో కరణ్ ని నానా తిట్లు తిట్టిపోశారు. అయితే, కరోనా కాలంలో కరణ్ ని ట్రోల్ చేయటం ఇంకా సొషల్ మీడియాలో మానటం లేదు. కొనసాగుతూనే ఉంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ వ్యవహారంలోనూ కరణ్ జోహర్ విలన్ అయ్యాడు.
Read Also: ‘’అందరూ ప్రేమలో పడుతున్నారు! కానీ, నేను మాత్రం…’’ కేరళ కుట్టి నాటీ జవాబు!
తాను నిర్మించబోయే ‘దోస్తానా 2’ చిత్రం నుంచీ కార్తీక్ ఆర్యన్ని తొలగించాడు కేజో. అది కాస్తా తిరగబెట్టి మరోసారి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. సుశాంత్ లాగా ఇప్పుడు కార్తీక్ ని కరణ్ టార్గెట్ చేశాడని నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. మౌనంగా ఉండటం తప్ప కరణ్ ఇంకేం చేయలేకపోయాడు. అయితే, ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా ఓ పంచ్ విసిరాడు తన శత్రువుల మీద!
ఓ రెడ్ కలర్ ట్రెండీ టీషర్ట్ ధరించిన కేజో సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని యధావిధిగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అయితే, ఆయన టీషర్ట్ పై ‘బురి నజర్ వాలే తేరా మూ కాలా’ అని హిందీ క్యాప్షన్ ఉంది! సాధారణంగా టీ షర్ట్స్ పై ఇంగ్లీషు పదాలుంటాయి. ఈ స్పెషల్ ఔట్ ఫిట్ పై మాత్రం, మన బాలీవుడ్ టాప్ డైరెక్టర్, హిందీ సామెత ఇంగ్లీషు పదాల్లో అచ్చేయించుకున్నాడు!
‘బురి నజర్ వాలే తేరా మూ కాలా’ అంటే… ‘నన్ను చూసి ఏడ్చే నీ ముఖం మాడిపోను…’ అని మనం లూజ్ గా ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు!