పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరపడుతోంది. ప్రతి సంవత్సరం ఆయన అభిమానులు ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రజంట్ ప్రబాస్ వరుస ప్రజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈసారి ఫ్యాన్స్ కోసం బర్త్ డే గిఫ్ట్ గా.. మేకర్స్ ఒక్కో మూవీ నుండి మూడు సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేస్తున్నారట..
Also Read : Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉంది. ప్రస్తుతం గ్రీస్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో, పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ మొదటి సింగిల్‌ను రిలీజ్ చేయాలని టీమ్ నిర్ణయించింది. ఈ పాటలో ప్రభాస్ లుక్, స్టైల్‌ను గ్రాండ్‌గా చూపించబోతున్నారని సమాచారం. ఇక రెండో సర్‌ప్రైజ్ విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’ గురించి టీజర్ అప్‌డేట్ రానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. డ్యూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హను స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. పుట్టినరోజు రోజున ఫౌజీ టైటిల్ రివీల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.
మూడో సర్‌ప్రైజ్‌గా, ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ను స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘బాహుబలి’ మళ్లీ పెద్ద తెరపైకి రాబోతోంది. రెండు భాగాలు కలిపి చేసిన రీ-ఎడిట్ వెర్షన్ ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న IMAX, Dolby Cinema, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. దీని ట్రైలర్‌ను ప్రభాస్ పుట్టినరోజు రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే ఈసారి ప్రభాస్ బర్త్‌డే ఫ్యాన్స్‌కి ట్రిపుల్ ట్రీట్.. ఒక పాట (‘ది రాజా సాబ్’ నుంచి),ఒక టైటిల్ రివీల్ (‘ఫౌజీ’ నుంచి),ఒక ట్రైలర్ (‘బాహుబలి: ది ఎపిక్’). ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో బర్త్‌డే ట్రెండ్స్ మొదలుపెట్టేశారు. మొత్తానికి ఈ పుట్టినరోజు ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా మారబోతోందని చెప్పాలి!