2022 లో వచ్చిన ‘కాంతార’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. రిలీజైన ప్రతి ఒక్క భాషలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్‌ని కూడా ప్రకటించిన టీం.. ముందు బాగం కంటే అంతకు మించి తెరకెక్కిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. చిత్రీకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఈ మూవీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు మరణించగా.. ఇప్పుడు సెట్ లో మరో విషాదం చోటు చేసుకుంది.
Also Read : Tollywood : ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన.. టాలీవుడ్ బెస్ట్ మూవీస్
ఈ మూవీలో నటిస్తున్న నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి సెట్ లోకి అడుగుపెట్టిన కళాభవన్ ఛాతీనొప్పి తో ఇబ్బందిపడగా, చిత్రబృదం ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఇక ఈ విషయంపై ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్య బృందం తెలిపింది. అయితే దీని గురించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటించినప్పటికీ, కళాభవన్ మృతి చెందినట్లు ఆయన మిత్రుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కణ్ణన్ సాగర్ తెలిపారు.