Site icon NTV Telugu

Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!

Mohanbabu

Mohanbabu

కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా ఉంటాడో అలాంటి లింగం కాదు. అక్కడ భక్తనీయ స్వామి అనే పేరు. అక్కడికి వెళ్లి ఆ భగవంతుని ప్రార్థిస్తే, ఈ రోజుకీ నమ్ముతారు.

Also Read: OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..

ఆ రోజుల్లో మా అమ్మ, నాన్న అక్కడికి వెళ్లి, మా నాన్నగారు ప్రార్థించారు. ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి ఐదుగురు సంతానమైనాం. ఏర్పేడు నుంచి మా ఊరు వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో, ఒక్కోసారి మా తల్లి ఐదుగురు సంతానాన్ని తన భుజాల మీద వేసుకుని వెళ్ళేది,” అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. “నా కంఠాన్ని, నా మాటలను పదిమంది మెచ్చుకుంటుంటే, ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది, పరమేశ్వరా అని అనుకున్నాను.

Also Read:Manchu Vishnu : ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!

ఇలా ప్రారంభమైంది నా జీవితం. చెప్పులు కూడా లేకుండా, తిండి తిని తినక, స్వయంకృషితో పైకి వచ్చాను. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు, ‘భయం అనేది జీవితంలో ఉండకూడదు. ఎందుకు భయం? నేను ఏ తప్పు చేయనప్పుడు,’ అని నాకు నేర్పిస్తే, అదే విషయాన్ని నేను నా విద్యాలయాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్నాను. మా విద్యాలయాల్లో చదివిన పిల్లలు ఐపీఎస్, ఐఏఎస్, డీఎస్పీలు, ఎలక్షన్ కమిషనర్లుగా పని చేస్తున్నారు. ఈ కన్నప్పను ఆ పరమేశ్వరుడే ఆశీర్వదించాడు. ఈడు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేశాడు. మా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా చేశాడు అనేది నేను చెప్పదలచుకోలేదు.”

Exit mobile version