Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా ఉంటాడో అలాంటి లింగం కాదు. అక్కడ భక్తనీయ స్వామి అనే పేరు. అక్కడికి వెళ్లి ఆ భగవంతుని ప్రార్థిస్తే, ఈ రోజుకీ నమ్ముతారు.
Also Read: OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ఆ రోజుల్లో మా అమ్మ, నాన్న అక్కడికి వెళ్లి, మా నాన్నగారు ప్రార్థించారు. ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి ఐదుగురు సంతానమైనాం. ఏర్పేడు నుంచి మా ఊరు వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో, ఒక్కోసారి మా తల్లి ఐదుగురు సంతానాన్ని తన భుజాల మీద వేసుకుని వెళ్ళేది,” అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. “నా కంఠాన్ని, నా మాటలను పదిమంది మెచ్చుకుంటుంటే, ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది, పరమేశ్వరా అని అనుకున్నాను.
Also Read:Manchu Vishnu : ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!
ఇలా ప్రారంభమైంది నా జీవితం. చెప్పులు కూడా లేకుండా, తిండి తిని తినక, స్వయంకృషితో పైకి వచ్చాను. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు, ‘భయం అనేది జీవితంలో ఉండకూడదు. ఎందుకు భయం? నేను ఏ తప్పు చేయనప్పుడు,’ అని నాకు నేర్పిస్తే, అదే విషయాన్ని నేను నా విద్యాలయాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్నాను. మా విద్యాలయాల్లో చదివిన పిల్లలు ఐపీఎస్, ఐఏఎస్, డీఎస్పీలు, ఎలక్షన్ కమిషనర్లుగా పని చేస్తున్నారు. ఈ కన్నప్పను ఆ పరమేశ్వరుడే ఆశీర్వదించాడు. ఈడు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేశాడు. మా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా చేశాడు అనేది నేను చెప్పదలచుకోలేదు.”
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!