టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, చిత్ర బృందానికి ఊహించని ఎదురుదెబ్బగా నిలిచింది.
Also Read:Unni Mukundan : కుట్ర పూరితంగా అలా చేస్తున్నాడు.. మేనేజర్ పై ఉన్ని ముకుందన్..
ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్ కార్యాలయానికి డీటీడీసీ కొరియర్ ద్వారా పంపిన హార్డ్ డిస్క్‌లో ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించిన కీలకమైన వీఎఫ్ఎక్స్ డేటా మరియు రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హార్డ్ డిస్క్ మే 25న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి చేరింది. కొరియర్ రిసీవ్ చేసిన సిబ్బంది సభ్యుడు రఘు, ఆ డిస్క్‌ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అయితే, చరిత ఆ తర్వాత అదృశ్యమైందని, హార్డ్ డిస్క్ కూడా ఆమెతో పాటు మాయమైనట్లు నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది.
Also Read:Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్‌చేస్తే..
ఈ ఘటనను గుర్తించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్, ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. రఘు – చరితలు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఉద్యోగులు కానప్పటికీ, వారి చర్యలను మోసం మరియు చోరీగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన నేపథ్యంలో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. “జటాజూట ధారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ? అంటూ పోస్ట్’’ చేశారు.
