Unni Mukundan : మలయాళ స్టార్ యాక్టర్ ఉన్ని ముకుందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనేజర్ విపిన్ కావాలనే తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదంటూ తెలిపాడు ఉన్ని. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా కేసు పెట్టాడంటూ ఆరోపించారు. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదని.. ఆరేళ్ల పాటు తన వద్ద పని చేసినా సరే ఇప్పటి వరకు ఏమీ అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశారంటూ విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Read Also : Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్‌చేస్తే..‘
‘నేను నరివెట్ట మూవీలో టొవినో థామస్ యాక్టింగ్ ను మెచ్చుకుంటూ ఓ సోషల్ మీడియా పోస్టు చేశాను. కానీ అది ఉన్ని ముకుందన్ కు అసూయ పుట్టింది. అందుకే తన వద్ద పని మానేయాలన్నాడు. నేను సరే అన్నాను. కానీ తర్వాత రోజు తన ఇంటికి పిలిచి నన్ను కొట్టాడు. బూతులు తిట్టాడు. నేను వేరే సినిమాలకు ప్రమోషన్స్ చేస్తాను. చాలా మందికి పీఆర్ గా పనిచేస్తున్నాను.
ఆ విషయం ఉన్ని ముకుందన్ కు కూడా తెలుసు. అయినా సరే కావాలనే ఉద్దేశ పూర్వకంగా అలా చేశాడు. మార్కో తర్వాత అతనికి అవకాశాలు రావట్లేదు. అందుకే ఇలా డిప్రెషన్ లో ఇలాంటి పనులు చేస్తున్నాడు. అతనికి ఎవరూ ఛాన్సులు ఇవ్వట్లేదు’ అంటూ విపిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా ఉన్ని ముకుందన్ స్పందిస్తూ ఇలా క్లారిటీ ఇచ్చాడు.
Read Also : Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..