Dr. Shiva Rajkumar: క్యాన్సర్ తగ్గింది.. ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శివ రాజ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నానని, త్వరలో సినిమాలు మళ్ళీ మొదలు పెడతానని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్ అధికారికంగా తెలిపారని ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, శివరాజ్‌కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేసి, వైద్యులు శివన్నకు క్యాన్సర్ లేదని చెప్పారన్నారు. శివరాజ్‌కుమార్ కూడా మాట్లాడుతూ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నానని, త్వరలో రంగంలోకి దిగుతానని చెప్పారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రార్థనలకు ధన్యవాదాలు. శివరాజ్ కుమార్‌కి సంబంధించిన అన్ని రిపోర్ట్‌లు నెగిటివ్‌గా వచ్చాయి. చివరకు మేము పాథాలజిస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. అది కూడా నెగెటివ్ అని వచ్చిందని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు క్యాన్సర్ నయమైందని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మీ ప్రార్థనలు, ఆశీస్సులతోనే శివరాజ్‌కుమార్ ఇంత బాగా ఉండగలిగారు. ఇది నా జీవితంలో మరిచిపోలేను అని గీతా శివరాజ్‌కుమార్ వీడియోలో తెలిపారు.
Hit 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఆ తర్వాత శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ బెంగుళూరులో కీమోథెరపీ చేసిన డాక్టర్లు, నర్సులు నన్ను బాగా చూసుకున్నారు. ను క్లైమాక్స్ ఫైట్స్ ఎలా చేశానో నాకు తెలీదు. క్రెడిట్ రవి వర్మన్‌కే దక్కాలి. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడే కొద్దీ టెన్షన్ ఎక్కువైంది. ఈ సమయంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గీత లేకుండా నేను లేను. మధు బంగారప్ప గురించి ఎంత చెప్పినా తక్కువే, చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. బాప్టిస్ట్ హాస్పిటల్, మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా నన్ను బాగా చూసుకున్నాయి. ఇది చాలా పెద్ద ఆపరేషన్. కిడ్నీ మార్పిడి చేశామని చెబుతున్నారు. కానీ, విషయం అది కాదు. క్యాన్సర్‌తో కూడిన యూరినరీ బ్లాడర్‌ను తొలగించారు. ఇప్పుడు కొత్త బ్లాడర్‌ను అమర్చినట్లు చెప్పారు, ఇదే జరిగింది. నేను తిరిగి వస్తాను. అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఎప్పుడూ రెట్టింపు శక్తి ఉంటుంది. డ్యాన్స్, ఫైటింగ్, లుక్స్ రెండింతల శక్తిని కలిగి ఉంటాయి. మీ ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని శివరాజ్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!