యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఐకానిక్ హిట్ చిత్రాల్లో ‘ఇండియన్’ (1996) ఒక మైలురాయిగా నిలిచింది. లెజెండర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో నేటికీ చెరిగిపోని ముద్ర వేసింది. దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అని కూడా విపరీతంగా ఆకటుకున్నాయి.
Also Read : Sridevi : ఫస్ట్ హిట్‌తోనే లగ్జరీ కారు కొనేసిన బ్యూటీ !
ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ఇండియన్ 2 అనౌన్స్ చేయడమే కాదు, మేకర్స్ అప్పుడే ఇండియన్ 3ని కూడా ప్లాన్ చేశారు. అయితే ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఇండియన్ 2 మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. భారీ హైప్, స్టార్ కాస్ట్ ఉన్నా, ఆడియెన్స్ రెస్పాన్స్ మిక్స్డ్‌గా నిలిచింది. దీంతో భాగం 3పై అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. షూటింగ్ ఆగిపోయిందన్న రూమర్లు, ఓటిటి రిలీజ్ అనే ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది అయితే ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ కే స్వస్తి పలికేశారని కూడా భావించారు.
అయితే ఇప్పుడు మరోసారి తమిళ సినీ వర్గాల్లో నుంచి ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. శంకర్ స్వయంగా ‘ఇండియన్ 3’ వస్తుంది అని స్పష్టంగా చెబుతుండగా, తాజా బజ్ ప్రకారం ఇప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాట షూట్ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. అవి పూర్తయ్యాక సినిమా త్వరలోనే థియేటర్లలోకి రావచ్చని కథనాలు ఊపందుకున్నాయి. ఈ విషయాలన్నింటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ పూర్తి స్థాయిలో ఏదీ ఖరారు చేయలేం కానీ ‘ఇండియన్ 3’ వస్తుంది.. అన్న శంకర్ మాట మాత్రం అభిమానుల్లో కొత్తగా ఆసక్తి రేపుతోంది.