నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.”మా ఊరి పొలిమేర” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్లాక్ మ్యాజిక్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ” మూవీ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్ అయింది.కామాక్షి భాస్కర్లకు మా ఊరి పొలిమేర తో పాటు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ” మూవీ కూడా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కాగా మా ఊరి పొలిమేర 2 సినిమాకుగాను ఇటీవల ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటిగా కామాక్షి భాస్కర్ల అవార్డును కూడా అందుకున్నది. ఈ అవార్డు రావడంపై కామాక్షి భాస్కర్ల ఆనందం వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో కామాక్షి భాస్కర్ల మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఓ జర్నలిస్ట్ జీవితంలో జరిగే సంఘటనలను ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సిరీస్‌లో చూపించారు .దూత సిరీస్ కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో మరో వెబ్‌సిరీస్ చేసేందుకు నాగచైతన్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది దూతకు కొనసాగింపే అయినా కూడా కథ మరియు బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం.ఈ వెబ్‌సిరీస్‌లో కామాక్షి భాస్కర్ల ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఈ సిరీస్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.