Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ ‘అమృతం’ లైవ్ మ్యాజిక్

Kalyani Malik

Kalyani Malik

ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, స్టార్ సింగర్ గీతా మాధురిల ఆధ్వర్యంలో “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” (The Night of the Stars) పేరిట ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగబోతోంది. సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుక జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ పబ్లో జరగనుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రెస్ మీట్‌లో నిర్వాహకులతో పాటు కళ్యాణి మాలిక్, గీతా మాధురి పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వేడుక గురించి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో మొదటి సినిమా ‘ఐతే’ విడుదలైనప్పుడు ఎంతటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఫీలయ్యానో.. ఇప్పుడు ఈ లైవ్ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా నాలో అదే ఎనర్జీ, అదే భావన కలుగుతోంది. మా సింగర్స్ టీమ్ అంతటితో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. జూన్ 12న జరిగే ఈ మ్యూజికల్ ఈవెంట్ ప్రేక్షకులను కచ్చితంగా సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ.. “కళ్యాణి మాలిక్ ఫస్ట్ టైమ్ ఇలాంటి లైవ్ షో చేస్తుండటంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఎడతెరిపి లేకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కళ్యాణి మెలోడీస్, ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. నాకు పర్సనల్‌గా లైవ్ మ్యూజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అసెంబ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఒక వండర్‌ఫుల్ వేదికపై కళ్యాణి మాలిక్ గారి సూపర్ హిట్ పాటలను పాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆనందం వ్యక్తం చేశారు.

×
×
Ad