Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ ‘అమృతం’ లైవ్ మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, స్టార్ సింగర్ గీతా మాధురిల ఆధ్వర్యంలో “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” (The Night of the Stars) పేరిట ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగబోతోంది. సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుక జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ పబ్‌లో జరగనుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులతో పాటు కళ్యాణి మాలిక్, గీతా మాధురి పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వేడుక గురించి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో మొదటి సినిమా ‘ఐతే’ విడుదలైనప్పుడు ఎంతటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఫీలయ్యానో.. ఇప్పుడు ఈ లైవ్ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా నాలో అదే ఎనర్జీ, అదే భావన కలుగుతోంది. మా సింగర్స్ టీమ్ అంతటితో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. జూన్ 12న జరిగే ఈ మ్యూజికల్ ఈవెంట్ ప్రేక్షకులను కచ్చితంగా సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ.. “కళ్యాణి మాలిక్ ఫస్ట్ టైమ్ ఇలాంటి లైవ్ షో చేస్తుండటంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఎడతెరిపి లేకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కళ్యాణి మెలోడీస్, ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. నాకు పర్సనల్‌గా లైవ్ మ్యూజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అసెంబ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఒక వండర్ఫుల్ వేదికపై కళ్యాణి మాలిక్ గారి సూపర్ హిట్ పాటలను పాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!