మూడు భాగాలుగా కళ్యాన్ రామ్ “బింబిసారా”?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టైం ట్రావెల్ లైన్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కుతోందట. మొదటి భాగం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. ఇది ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బిగ్ స్క్రీన్లలోకి రానుంది. ఆ తరువాత మిగతా రెండు భాగాల చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
- Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!