Mario : బక్క చిక్కిన హెబ్బా.. నవంబర్‌లో ‘మారియో’ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగ మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ జీ గోగణ, ఇప్పుడు ‘మారియో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా, కంటెంట్ ఓరియెంటెడ్ కమర్షియల్ జానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ప్రస్తుతం ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా, సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం తెలుపుతోంది. ఈ ‘మారియో’ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ మరియు రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు, మాటలను రాకేందు మౌళి సమకూర్చారు. అంతేకాకుండా, కథ మరియు సంభాషణల అభివృద్ధిలో కూడా రాకేందు మౌళి దర్శకుడు గోగణకు మద్దతుగా నిలిచారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, MN రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, మణికాంత్ మరియు మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.
Also Read
- Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
- Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
- Chennai LoveStory : 'చెన్నై లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!