Site icon NTV Telugu

Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn

Kajol

Kajol

రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!

నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీ గురించి నేను మాట్లాడిన విషయం మీద ఇప్పుడు స్పందిస్తున్నాను. నా కెరీర్‌లో రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నాను. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు అక్కడ స్టే చేశాను కూడా. అది ఫిలిం మేకింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ ఎన్విరాన్‌మెంట్. అలాగే, అక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నేను పరిశీలించాను.

Also Read:Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

అది కచ్చితంగా ఫ్యామిలీలు అలాగే చిన్న పిల్లలు వెళ్లడానికి అద్భుతమైన డెస్టినేషన్. అలాగే, వాళ్లందరికీ సేఫెస్ట్ ప్లేస్ కూడా అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, రామోజీ ఫిలిం సిటీలో నెగటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యానని, దయ్యాలు లాంటివి ఉన్నట్లు ఎక్స్‌పీరియన్స్ చేశానని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాను. అయితే, సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు.

Exit mobile version