Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నేటితరం జంటలలో విడాకులు పెరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సహనం తగ్గడం, స్మార్ట్ఫోన్ల వాడకం మితిమీరడమే ఇందుకు ముఖ్య కారణాలని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా చాలా మంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోవడానికి సిద్ధపడుతుండటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అడిక్షన్ ప్రభావం మనుషుల వ్యక్తిగత బంధాలపై విపరీతంగా పడుతోందని కాజల్ పేర్కొన్నారు. చాలామంది దంపతులు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదని, ఒకే గదిలో ఉన్నా లేదా డిన్నర్ డేట్స్‌కి వెళ్లినా కూడా చేతుల్లో ఫోన్లు పట్టుకుని స్క్రోలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని తప్పుపట్టారు. భార్యాభర్తల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఎదుటివారి అభిప్రాయాలను వినే ఓపిక, సహనం లోపించడం వంటి అంశాలే చివరకు బంధాలు బలహీనపడి విడాకుల కోసం కోర్టుల వరకు వెళ్లాల్సి వస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి కూడా స్పందిస్తూ.. తాను తన భర్త గౌతమ్ కిచ్లూ ప్రతి వారంలో కచ్చితంగా ఒక రోజు డిన్నర్‌కి బయటకు వెళ్తామని, ఆ సమయంలో ఫోన్లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుతామని చెప్పారు. బలమైన అనుబంధానికి ఫోన్లు కాకుండా మనసు విప్పి మాట్లాడుకోవడమే అసలైన పిల్లర్ అని ఆమె నేటి యువతకు సూచించారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న కాజల్.. ఇప్పుడు దంపతుల మధ్య కమ్యూనికేషన్ ఎంత అవసరమో తన మాటల్లో చెప్పింది. ఫోన్ వినియోగం, కమ్యూనికేషన్ తగ్గడం వంటి అంశాలు సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే చర్చకు ఆమె వ్యాఖ్యలు మరోసారి కారణమయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కాజల్ లాయర్ పాత్రలో కనిపించారు. ఆహార కల్తీ, వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- Tags
- cinema
- Kajal Aggarwal
తాజావార్తలు
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!