Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!

Kajal Aggarwal (1)

Kajal Aggarwal (1)

మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే వినూత్న ఛాలెంజ్‌ను ప్రారంభించారు.

సమంత, రకుల్ ప్రీత్‌లకు కాజల్ సవాల్!

ఈ ఛాలెంజ్‌లో భాగంగా కాజల్ అగర్వాల్ తన భోజనం పళ్లెం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మనం తినే ఆహారంలో పురుగుమందుల కల్తీ ఎంతవరకు ఉందనే కోణంలో ఆలోచన రేకెత్తించే పోస్ట్ పెట్టారు. ఈ చైతన్య ఉద్యమం ఇక్కడితోనే ఆగిపోకుండా ఉండేందుకు ఆమె టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్ లని ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ నామినేట్ చేశారు. మరోవైపు శ్రేయాస్ తల్పాడే కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగమవుతూ.. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఈ సవాల్‌ను స్వీకరించి తమ భోజనం ఫోటోలను షేర్ చేయాలని పిలుపునిచ్చారు. థియేటర్లలో కేవలం సినిమా చూపించడమే కాకుండా, ప్రతి ఇంటా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న పురుగుమందులు, రసాయనాల వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతోందనే సున్నితమైన, అత్యంత భయంకరమైన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ క్రేజీ సోషియో-రియలిస్టిక్ డ్రామా జూలై 24, 2026న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.