‘నో మేకప్’ లుక్ లో మెరిసిపోతున్న చందమామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కరోనా సమయంలో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గ ఉంటోంది. తరచూ తన స్టన్నింగ్ పిక్స్ తో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా కాజల్ షేర్ చేసిన ‘నో మేకప్’ లుక్ ఆకట్టుకుంటోంది. మంగళవారం (జూన్ 1) కాజల్ అగర్వాల్ తన అభిమానులతో నో మేకప్ సెల్ఫీని పంచుకున్నారు. ఇందులో ఆమె తెల్లటి చొక్కాలో కఫ్డ్ స్లీవ్స్‌తో, చీలిక జీన్స్‌తో కన్పిస్తోంది. “కొన్నిసార్లు మీరు చేయాల్సిందల్లా ఊపిరి పీల్చుకోవడమే” అనే క్యాప్షన్ ఇచ్చింది. కాజల్ నో మేకప్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా కాజల్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే అతిధి పాత్రలలో నటిస్తున్నారు. తమిళ చిత్రం “హే సినమిక”లో దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరిలతో కలిసి నటిస్తోంది. ఇంకా “ఘోస్టీ” అనే హర్రర్ కామెడీ, కమల్ హాసన్”ఇండియన్ 2″లలో నటిస్తోంది.
Also Read
- Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
- Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!