Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!

Kajal Aggarwal (1)

Kajal Aggarwal (1)

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్‌లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్‌లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని తెలిపారు. అనంతరం అతని ఛాతిపై తన పేరుతో వేయించుకున్న టాటూను చూపించాడని చెప్పారు.

ఆ సంఘటన తనను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని కాజల్ వెల్లడించారు. “అతను నా పేరుతో టాటూ వేయించుకోవడం వెనుక అభిమానమే ఉండొచ్చు. కానీ నా అనుమతి లేకుండా కారవాన్‌లోకి రావడం, నా వ్యక్తిగత హద్దులను దాటేలా ప్రవర్తించడం మాత్రం సరైన విషయం కాదు” అని ఆమె స్పష్టం చేశారు. సెలబ్రిటీలపై అభిమానాన్ని చూపించడం తప్పు కాదని, అయితే వారి వ్యక్తిగత గోప్యతను, వ్యక్తిగత హద్దులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాజల్ పేర్కొన్నారు. అభిమానమనే పేరుతో అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రదేశాల్లోకి ప్రవేశించడం లేదా ఎదుటివారిని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాజల్ అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రత, ప్రైవసీపై మరోసారి చర్చకు దారితీశాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ NBK111, రామాయణ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు.