కిచ్చా సుదీప్ ఇంటి నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఓ బ్యూటీ దాదాపుగా ఖరారైంది. ఫస్ట్ సినిమాతో రిస్క్ కు రెడీ అవుతున్నారు ఈ వర్థమాన నటుడు.. ఇంతకు సుదీప్ ఇలాగా నుండి వస్తున్న హీరో ఎవరు..? అనేది చూద్దాం. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్లీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. వివేక అనే కొత్త దర్శకుడు సంచిత్ ను డీల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. సుప్రీయాన్వి ప్రొడక్షన్స్, కేఆర్జీ స్టూడియోపై తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంచిత్ సరసన యాక్ట్ చేయబోతుంది కన్నడ నయా బ్యూటీ కాజల్ కుందర్.
Akanksha Sharma : ఆకాంక్ష.. అలా అందాలను చూపించి ఆ‘కాంక్ష’లను పెంచకమ్మా !
కేటీఎం, లైన్ మ్యాన్, పీప్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్.. కిచ్చా సుదీప్ మేనల్లుడితో జోడీ కడుతుంది. కేటీఎంలో దసరా ఫేం దీక్షిత్ శెట్టితో కలిసి యాక్ట్ చేసింది అమ్మడు. ఇవే కాకుండా బాండ్ రవి, మాయా కన్నడితో లాంటి చిత్రాల్లో స్కోప్ ఉన్న రోల్స్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఇప్పటికే కంప్లీట్ చేసిన బిలి చుక్కి హల్లీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మూవీకి మెయిన్ లీడ్ గా కమిటయ్యింది. ఇప్పుడు అల్లుడితో ఆఫర్ కొల్లగొట్టిన ఆమె.. ఫ్యూచర్ లో మామ సుదీప్ తో యాక్ట్ చేస్తానన్న హోప్స్ వ్యక్తం చేస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేయనున్నారు మేకర్స్. మరీ మేనమామలా అల్లుడు గుర్తింపు తెచ్చుకుంటాడో.. ఈ నట వారసుడ్ని కన్నడిగులు ఆశీర్వదిస్తారో లేదో చూడాలి.