KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్.. ఎందుకంటే?
- కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క"
- ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ”క” సినిమా ట్రైలర్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” మూవీ ట్రైలర్ చాలా బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. మరో నాలుగు రోజులే ఉంది సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒక వారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు, మలయాళంలో దుల్కర్ లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కి రిలీజ్ అవుతోంది.
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌసుకు క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఎవరెవరు వెళ్లారంటే?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
కాబట్టి ఒక వారం ఆగి “క” సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగులో మీరు మంచి సక్సెస్ ఇస్తే ఆ భాషల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. “క” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. దీని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి. “క” సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం. “క” సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా. వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక. అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. “క” సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..