రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
Also Read : Atadu4k : ‘అతడు’ రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు
ఎన్నో సంచలనాలు నమోదు చేసిన కాంతర కు ఇప్పుడు ప్రీక్వెల్ గా కాంతార ఏ లెజెండ్ ఛాప్టర్ -1ను తీసుకురాబోతున్నాడు హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి. షూటింగ్ ముగించుకుని ఈ ఏడాది అక్టోబరు 2న రిలీజ్ కు రెడీ గా ఉంది. అయితే ఇప్పుడు కాంతార సీక్వెల్ గా కాంతార- 3 ని తెరకెక్కించబోతున్నాడట రిషబ్ శెట్టి. లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతర సీక్వెల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడట. అందుకు సంభందించి చర్చలు కూడా ముగిసాయిని కూడా తెలిసింది. వార్ 2 స్పైవర్స్‌తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పడు కాంతార యూనివర్స్ ఫ్రాంచైజీతో కన్నడలోలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైఫు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా ఓకే చేసాడు. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి డైరెక్షన్ లో కాంతర చేయబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ లైనప్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు చూస్తూనే పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ స్టార్ గా మారేందుకు స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.
