Site icon NTV Telugu

NTR Fans : టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇంటి ముట్టడి!

Ntr Fans

Ntr Fans

జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి సదరు ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడతారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి అన్నారు.

Also Read:food waste penalty: ఫుడ్ వేస్ట్ చేస్తున్నరా.. అయితే మీకు ఫైన్ వేస్తారు జాగ్రత్త !

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు అని పేర్కొన్న ఆయన, మా ఎన్టీఆర్ తల్లిని అలా మాట్లాడారనే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదన్నారు. అలా ఎవరు మాట్లాడినా తప్పే!! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం, చలో అనంతపుర్‌కి పిలుపునిస్తాం అని హెచ్చరించారు. ఇక ఈ మీడియా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ ప్రెసిడెంట్‌తో పాటు జిల్లాల వారీగా ఉన్న ప్రెసిడెంట్స్ కూడా హాజరయ్యారు.

Exit mobile version