దర్శకదీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికి తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న లీకేజీ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు. అందుకే షూటింగ్ సెట్ లోకి వచ్చే యూనిట్ సభ్యులు ఐడీకార్డులు మెడలో తగిలించుకొని అడుగుపెడుతారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఐడీకార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకున్నాయి. ఇదిలావుంటే, తాజాగా హీరో ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఐడీ కార్డుని షేర్ చేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఐడీ కార్డు ధరించానని ఎన్టీఆర్ వెల్లడించారు. సెట్స్ మీద ఉండగా ఐడీ కార్డు వేసుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఇందులో ‘నందమూరి తారకరామారావు.. హీరో’ అని ఉండడం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.