యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. రిలీజ్ రోజు ఫ్యాన్స్ నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న దేవర సాధారణ ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. అది కాస్త రెండవ రోజు హిట్ టాక్ గా మారి మంచి వసూళ్లు రాబట్టింది. హిట్ టాక్ తో దేవర రిలీజ్ కాబడిన ప్రతి ఏరియాలో కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్ర విజయంపై అటు బయ్యర్లు, ఇటు నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అని చెప్పడంలో రెండవ మాటే లేదు.
Also Read : Siva : 35 సంవత్సరాల ట్రెండ్ సెట్టర్ అక్కినేని నాగార్జున, RGV ల ‘శివ’
కాగా దేవర రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ పట్టించుకోని మేకర్స్ హిట్ అవడంతో తాజాగా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. దాంతో పాటుగా ప్రముఖ యాంకర్ సుమతో చిట్ చాట్ వంటివి నిర్వహిస్తూ నిత్యం దేవర సినిమా గురించి ఆడియెన్స్ మాట్లాడుకునేలా సరికొత్త పంథాలో వెళ్తోంది దేవర టీమ్. కాగా సుమాకిచ్చిన ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసాడు.సోషల్ మీడియాలో పెరిగిపోతున్న నెగిటివిటీ గురించి మాట్లాడుతూ ” ప్లైన్ గా మనం ఉండలేకేపోతున్నాం. మనకి సినిమా చూసేటప్పుడు ఏవేవో క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని చాలా మంది ఫస్ట్ సినిమా చూడకుండానే ఆ బాలేదు అని చెప్పడం అలవాటు అయిపోయింది. చాలా నెగటివ్ అయిపోయాం మనం లైఫ్ లో, సినిమా అక్కడ మొదలైంది, ఇక్కడమొదలైందని ఎదో పెద్ద అంతా తెలిసిన వాడిలాగా తూకాల ఇన్స్పెక్టర్ లాగ ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే, సినిమాలు చూసేటప్పుు డు మనం ఎందుకు ఇన్నోసెంట్ గ ఉండలేక పోతున్నాము సుమా” అని అన్నారు