Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!

Dragon

Dragon

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్’ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో భారీ యాక్షన్‌ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.

అయితే ఫస్ట్ గ్లిమ్స్‌లో ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల్లో కాస్త చర్చ జరిగింది. సినిమాలో అసలైన లుక్ ఇదేనా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సెకండ్ లుక్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెకండ్ లుక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైల్డ్ అండ్ పవర్ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ లుక్ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో డ్రాగన్ సెకండ్ లుక్‌ను రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఫ్యాన్స్ మరో ఆరు నెలల పాటు ఓపిక పట్టాల్సిందే. కానీ సెకండ్ లుక్ తో మాత్రం సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ‘డ్రాగన్’ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.

×
×
Ad