Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చిత్తూరు యాసలో మాట్లాడనుండటంతో, తిరుపతిలో ఈవెంట్ చేయడం ద్వారా లోకల్ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవ్వచ్చని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం, అఖిల్ – ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని లెనిన్ సినిమా కోసం ఆయన తిరుపతి ఈవెంట్‌కు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒకవేళ తారక్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తే తిరుపతిలో అక్కినేని – నందమూరి అభిమానుల సందడి మామూలుగా ఉండదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!