అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “జిన్” ప్రారంభమైంది. ఈ సినిమాను సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న చిన్మయి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబి నాడు, రవి భట్, సంగీత, బాలరాజు వాడి కీలక పాత్రలలో పోషిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో జిన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
Allu Arjun: కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా…ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాజ్ కందుకూరి, రామజోగయ్య శాస్త్రి స్క్రిప్ట్ ను అందచేశారు. ఈ సందర్భంగా హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ – ఈ రోజు మా జిన్ మూవీ లాంఛ్ కు గెస్ట్ లుగా వచ్చిన రామజోగయ్య గారికి, రాజ్ కందుకూరి గారికి థ్యాంక్స్. జిన్ సినిమా స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మంచి విజువల్స్ తో సినిమా చేయబోతున్నాం. డైరెక్టర్ చిన్మయ్ రామ్ గారి మీద మాకు బాగా నమ్మకం ఉంది. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోగా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉందన్నారు.