Site icon NTV Telugu

Jiiva: బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్‌ తో జీవా ప్రయోగం

Actor Jiiva

Actor Jiiva

యూత్‌ ను టార్గెట్‌ చేసే స్టోరీస్‌ సెలక్ట్ చేసుకుంటూ జీవా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్‌ చేసుకుంటున్నాడు…మాస్క్, వాలంటీర్‌, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే… అయితే లాస్ట్ ఇయర్‌ అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్‌ సైన్స్ ఫిక్షన్‌ హారర్‌ థ్రిల్లర్‌గా యూత్‌ అంచనాలకు చేరువైంది. బ్లాక్‌ మూవీతో గ్రాండ్‌ సక్సెస్‌ అందుకున్న హీరో జీవా, తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి జోడి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది.

Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్

రంగం, రంగం 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన జీవా కెరీర్‌ లో 46వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ కి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు… విశాల్‌ అండ్‌ జీవా ఫాదర్‌ ఆర్‌ బి చౌదరి సమక్షంలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.. జీవాతో పాటు ఈసినిమాలో బబ్లూ పృథ్విరాజ్‌ కూడా కనిపించనున్నారు… గతంలో జీవా రావణకొట్టం మూవీ ప్రొడ్యూసర్‌ గా చేసిన రవి కన్నన్‌, కన్నన్ రవి గ్రూప్‌ బ్యానర్‌ పై జీవా 46వ సినిమాను నిర్మిస్తున్నారు.. 45వ సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే జీవా 46వ సినిమాను లాంచ్‌ చేసి వరస మూవీస్‌తో స్పీడ్‌ పెంచేశాడు.

Also Read:

తమిళ భాషలో రిలీజ్ అయ్యి బ్లాక్‌ బస్టర్‌ అయిన బ్లాక్‌ మూవీని డార్క్ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్… ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది డార్క్… విభిన్న కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో యూత్ ని టార్గెట్‌ చేస్తూ మరోసారి కే.జి సుబ్రమణి డైరెక్షన్‌ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గా గోకుల్‌ బినాయ్‌ ని జీవా 46వ సినిమా కోసం ఎంచుకున్నాడు.. మరి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సక్సెస్‌ ను అందుకుంటుందో చూడాలి…

Exit mobile version