Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పొన్నియిన్ సెల్వన్’, ‘తని ఒరువన్’ (తెలుగులో ధ్రువ) చిత్రాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్న జయం రవి.. గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ.. లీగల్‌గా విడాకుల ప్రక్రియ ముగిసి, తన వ్యక్తిగత జీవితం కుదుటపడే వరకు సినిమాల్లో నటించనని, తన సినిమాల రిలీజ్‌లను కూడా నిలిపివేయాలని కోరుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
‘గత 23 ఏళ్లుగా నేను రాత్రింబగళ్లు కష్టపడి పనిచేశాను. నా కెరీర్లో 90 శాతం సినిమాలు విజయవంతమయ్యాయి. కానీ గత రెండేళ్లుగా నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారం నా మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీశాయి. చట్టబద్ధంగా నా విడాకులు పూర్తయ్యే వరకు నేను నటించలేను, నా వల్ల కావడం లేదు’ అని తెలిపారు. జయం రవి ఆకస్మికంగా నటనకు బ్రేక్ చెప్పడం విడాకుల తీర్పు వచ్చే వరకు సినిమాలను హోల్డ్‌లో పెట్టాలని పట్టుబట్టడం తమిళ బాక్సాఫీస్‌పై భారీ ప్రభావాన్ని చూపించనుంది. ఆయన నటిస్తున్న దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న క్రేజీ సినిమాలు ఇప్పుడు అటకెక్కే పరిస్థితి వచ్చింది.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
ముఖ్యంగా కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫాంటసీ డ్రామా ‘జీనీ’, అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘తని ఒరువన్ 2’ ల భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం తేలే వరకు జయం రవి సినిమాల ప్రమోషన్లలో కూడా పాల్గొననని స్పష్టం చేయడంతో టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!