Jayam Ravi: భార్య అరాచకంపై జయం రవి సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తితో విడాకులు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తర్వాత నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదు. సింగర్ కెనిషాతో ఆయనకు రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక పెళ్లిలో కనిపించారు. వెంటనే ఆయన భార్య ఆర్తి ఒక సుదీర్ఘమైన లేఖ విడుదల చేశారు. తాజాగా ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలను ఖండిస్తూ జయం రవి కూడా ఒక లేఖ విడుదల చేశారు.
Also Read:Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?
Also Read
నిజానికి వీరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎమోషనల్, ఫిజికల్ అబ్యూజ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గత వారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఆర్తి, జయం రవి పిల్లలను పట్టించుకోవడం లేదని ఆరోపించగా, తాజాగా జయం రవి, ఆమె తన పిల్లలను ఆయుధాలుగా వాడుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.
Also Read:Balakrishna : జైలర్-2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య..?
“నా మీద లేనిపోని అపవాదులు వేస్తే చూస్తూ ఊరుకోను. లీగల్ ప్రాసెస్‌పై నాకు నమ్మకం ఉంది,” అని తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ఆర్తితో వివాహం విషయంలో తాను బంధించినట్లు ఫీల్ అయ్యానని, ఇప్పుడు ఎట్టకేలకు ఫ్రీ అయిన ఫీలింగ్ కలుగుతోందని అన్నారు. “ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా నన్ను ఇబ్బందులకు గురిచేసింది. ఇలా చెప్పడం నాకు బాధగానే ఉంది. కనీసం నా సొంత తల్లిదండ్రులను కూడా కలిసే అవకాశం లేకుండా చేసింది. ఇలాంటి రిలేషన్‌లో ఉండడం కంటే బయటకు వచ్చేయడమే మంచిదని నిర్ణయించాను. ఆర్తి చేస్తున్న అన్ని ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. నేను ఇంటిని వదిలి బయటకు వచ్చేటప్పుడే ‘ఎక్స్’ అనే పదం నా మనసులో ముద్రించుకుపోయింది. ఇక జీవితాంతం అది అలాగే ఉండిపోతుంది,” అంటూ ఆయన సుదీర్ఘంగా నాలుగు పేజీల లేఖ రాశారు.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!