January 12 Vidudala: సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్, క్రిటిక్స్ రివ్యూలు ఇస్తుంటారు. కానీ, రిలీజ్‌కు ముందే ఆ సినిమాకు పనిచేస్తున్న సంగీత దర్శకుడే ఫస్ట్ రివ్యూ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా ఇదే జరిగింది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్న ‘జనవరి12విడుదల’ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు సగం పూర్తయ్యాయని చెబుతూ.. “ఈ సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది” అంటూ ఆయన ఏకంగా రిజల్ట్ ముందే చెప్పేశారు.
జీవీ ప్రకాశ్ నుంచి ఇంత గట్టి కాన్ఫిడెన్స్ రావడంతో అటు వెంకటేష్, ఇటు నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌పై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ (సాహు గారపాటి), సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
మరోవైపు, జీవీ ప్రకాశ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లతో జోరు మీద ఉన్నారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘ఇరుముడి’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత తెలుగులో ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమా జనవరి 12 విడుదల. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ‘దివికి దివికి’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సినిమా రీ-రికార్డింగ్ చూస్తూనే జీవీ ప్రకాశ్ బ్లాక్‌బస్టర్ హిట్ అని తేల్చేయడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది.

