Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్‌గా పనికిరానంది!

Sridevi Janhvi Kapoor

Sridevi Janhvi Kapoor

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తాను హీరోయిన్ అవ్వడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదన్న షాకింగ్ నిజాన్ని జాన్వీ తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన ముక్కుకు సర్జరీ (రైనోప్లాస్టీ) జరిగిన తర్వాతే తనపై శ్రీదేవికి నమ్మకం కుదిరిందని జాన్వీ పేర్కొంది. ఇటీవల ‘గలాట్టా ప్లస్’ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. జాన్వీకి కజిన్ అయిన నటి మహేశ్వరి ఈ ఇంటర్వ్యూకి హోస్ట్‌గా వ్యవహరించారు. తాను హీరోయిన్ అవుతానని మొదట చెప్పినప్పుడు శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారని జాన్వీ గుర్తుచేసుకుంది. “సినిమాల్లోకి వస్తే నీ జీవితం మొత్తాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది” అని శ్రీదేవి తనను హెచ్చరించినట్లు తెలిపింది. ఇదే విషయంపై మహేశ్వరి స్పందిస్తూ.. “జాను సినిమాల్లో నటించాలనుకుంటోంది కానీ, నాకెందుకో నమ్మకం లేదు. ఆ రంగానికి ఎంతో అంకితభావం, కఠిన శ్రమ, మానసిక దృఢత్వం కావాలి అని శ్రీదేవి నాతో కూడా చెప్పారు” అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సంభాషణ మధ్యలోనే జాన్వీ కల్పించుకుంటూ తన ముక్కు సర్జరీ గురించి బాంబ్ పేల్చింది. “బహుశా ఈ ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్ చేస్తారేమో. కానీ నిజం ఏంటంటే.. నా ముక్కు సర్జరీ జరగక ముందు వరకు నాలో హీరోయిన్ అయ్యే సత్తా ఉందని మా అమ్మ ఏమాత్రం నమ్మలేదు. ఆ సర్జరీ జరిగిన తర్వాతే నా లుక్స్ పట్ల, నా పొటెన్షియల్ పట్ల ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి ఆమె అంగీకరించారు” అంటూ జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కూతురు జాన్వీని వెండితెరపై హీరోయిన్ గా చూడాలని ఎంతో ఆశపడిన శ్రీదేవి, జాన్వీ తొలి సినిమా ‘ధడక్’ విడుదల కాకముందే 2018లో దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి, అక్కడి హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.